TV9 Telugu

24 January 2024

ప్రపంచంలో ఆరోగ్యవంతమైన 9 దేశాలు ఇవి.!

సింగపూర్: 86.9 ఆరోగ్య సూచికతో ప్రపంచంలోని ఆరోగ్యవంతమైన దేశాల జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలుస్తోంది.

జపాన్: సింగపూర్ తర్వాత 86.5 ఆరోగ్య సూచికతో జపాన్ రెండో స్థానంలో నిలుస్తోంది. ఆ దేశంలో క్యాన్సర్, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు తక్కువ

దక్షిణ కొరియా: ప్రపంచ ఆరోగ్య సూచీలో దక్షిణ కొరియా 84.8 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉంది. గత కొన్ని దశాబ్ధాల కాలంలో ఆ దేశ ప్రజల ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది.

తైవాన్: తైవాన్ ఆరోగ్య సూచిక 83.4గా ఉంది. ఆ దేశంలో మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన ఆస్పత్రులు ఉన్నాయి. 

చైనా: ప్రపంచంలోని ఆరోగ్యవంతమైన దేశాల జాబితాలో చైనాది ఐదో స్థానం. ఆ దేశ ఆరోగ్య సూచీ 1982లో 67.81 నుంచి 2023లో 78.7కు పెరిగింది.

ఇటలీ: బ్లూమ్‌బెర్గ్ హెల్త్ ఇండెక్స్ మేరకు ఆరోగ్యకరమైన జీవనశైలి, అలవాట్ల కారణంగా ప్రపంచ ఆరోగ్యవంతమైన దేశాల జాబితాలో ఇటలీ కూడా ఉంది.

ఐస్లాండ్: ఆరోగ్యకరమైన దేశాల జాబితాలో ఐస్లాండ్‌ చోటు దక్కించుకుంది. ఆ దేశం తన జీడీపీలో 8.6 శాతం ఆరోగ్య సంరక్షణ కోసం వెచ్చిస్తుండటం విశేషం. 

స్వీడన్: ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా స్పీడన్ కూడా ఆరోగ్యకరమైన దేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. 

ఆస్ట్రేలియా: అధిక నాణ్యమైన జీవన విధానం, పరిశ్రమైన పర్యావరణం, ఆరోగ్యకరమైన ఆహారంపై స్పృహతో ఆస్ట్రేలియా కూడా ఈ జాబితాలో ఉంది.