అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఒక గుడ్‌న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది ట్రంప్ సర్కార్.
మే నెలలో ఆగిపోయిన వీసా ఇంటర్వ్యూలు రీస్టార్ట్ చేయాలని నిర్ణయించిన అమెరికా సర్కార్. ఆగస్ట్‌లో అడ్మిషన్ కోరుకునేవాళ్లకు బిగ్ రిలీఫ్.
మేనెలలో తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను మళ్లీ ప్రారంభించింది అమెరికా ప్రభుత్వం. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా
ఖాతాలపై నిఘా పెట్టక తప్పదని స్పష్టం చేసిన ట్రంప్.
వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను యూఎస్ కాన్సులేట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ.
అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో భారతదేశం సెకండ్ ప్లేస్. ప్రతి సంవత్సరం ఉన్నత చదువుల కోసం అమెరికాకు 1.65 లక్షల మంది భారతీయ విద్యార్థులు పయనం.
అమెరికా వీసా కావాలనుకునే దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవేటు సెట్టింగ్స్‌ను మార్చుకుని ‘పబ్లిక్’ ఆప్షన్ పెట్టుకోవాల్సిందే.
విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చాకే వీసాలు మంజూరు చేయనున్న అమెరికా.
దేశ భద్రతకు ఏ ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే అమెరికా విద్యాసంస్థల్లో చదువుకునేందుకు అమెరికా అనుమతి.