25 December 2023
చదువు మానేసి 13 వ ఏట వినోద ప్రపంచంలోకి ప్రవేశించిన చాప్లిన్ ప్రపంచవ్యాప్తంగా మూకీ చిత్రాలకు రారాజుగా అవతరించాడు.
చార్లీ చాప్లిన్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నటుడు. అతని పేరు వింటే చాలు ముఖాలలో నవ్వు వస్తుంది. ప్రసిద్ధ హాస్య నటుడు, చిత్రనిర్మాత జీవితంలో పెను దుఃఖం దాగి ఉంది.
చార్లీ చాప్లిన్ పూర్తి పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. అతను మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. మూడుసార్లు అతను టీనేజ్ యువతులను వివాహం చేసుకున్నాడు.
చార్లీ చాప్లిన్ మొదటి వివాహం నటి మిల్డ్రెడ్ హారిస్‌తో జరిగింది. వివాహ సమయంలో మిల్డ్రెడ్ హారిస్ వయసు 17 సంవత్సరాలు. త్వరగానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
మొదటి భార్యతో విడాకుల తర్వాత చార్లీ చాప్లిన్ నటి లిటా గ్రేని రెండవ వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. ఈ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా ఎక్కువ కాలం నిలవలేదు.
54 సంవత్సరాల వయస్సులో అతను 18 ఏళ్ల ఓ'నీల్‌ను మూడవసారి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం చార్లీ జీవితంలో విజయవంతమైంది. ఎంతో సంతోషంగా జీవించారు.
చాప్లిన్ చనిపోయే వరకు ఓ'నీల్ తో కలిసే ఉన్నారు. ఈ దంపతులిద్దరికీ 8 మంది పిల్లలు. 88 సంవత్సరాల వయస్సులో 25 డిసెంబర్ 1977 న మరణించాడు.