ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగావిలాస్‌

ఈ నెల 13న పవిత్ర వారణాసిలో కాశీ విశ్వేశ్వరుని సన్నిధి నుంచి ప్రయాణం..

ప్రధాని నరేంద్రమోదీ ఈ నౌకను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

51రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఇది 50చోట్ల ఆగుతుంది.

గంగనదిలో ప్రయాణం మొదలుపెట్టి చివరకు బ్రహ్మపుత్ర నదితో ముగుస్తుంది.

62 మీటర్ల పొడవు…. 12మీటర్ల వెడల్పు ఉన్న ఈ నౌకలో 18 విలాసవంతమైన సూట్‌లున్నాయి.

ప్రయాణికులకు ఓ కదిలే ఇంద్రభవనంలో ఉన్న ఫీలింగ్ కలిగించేలా దీన్ని తీర్చిదిద్దారు.

ఇక 40మంది ఏకకాలంలో భోజనం చేసేలా రెస్టారెంట్ ను సిద్ధం చేశారు.

సుందరబెన్‌ అడవుల్లో రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌ను చూడొచ్చు.