రక్తహీనత లేదా ఇనుము లోపం అనేది మహిళల్లో చాలా సాధారణ సమస్య. హిమోగ్లోబిన్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు చేయించుకోవాలి.
థైరాయిడ్ సమస్య బరువు పెరగడం, క్రానిక్ ఫెటీగ్ , మలబద్ధకం వంటి వాటికి కూడా కారణం. థైరాయిడ్‌ను నిర్ధారించడానికి ఒక సాధారణ రక్త పరీక్ష ఉంది.
అధిక రక్తపోటు మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సరైన పరీక్షలు ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
ప్రతి ఏడాది ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నందున..స్త్రీలు తక్కువ-మోతాదు కంప్యూటెడ్ టోమోగ్రఫీ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
స్త్రీ గుండె ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి లిపిడ్ ప్రొఫైలింగ్ లేదా కొలెస్ట్రాల్ పరీక్ష తప్పనిసరి.
మహిళలు ఎముక సంబంధిత వ్యాధులకు గురవుతారు. విటమిన్ D3, కాల్షియం స్థాయిల కోసం స్క్రీనింగ్ క్రమం తప్పకుండా చేయించుకోవాలి.
మధుమేహం మహిళల్లో ప్రధాన సమస్యలలో ఒకటి. పిల్లల మధుమేహ ప్రమాదాన్ని నియంత్రించడానికి గర్భధారణకు ముందు రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయడం చాలా ముఖ్యం