ఉసిరి కాయ తినడం వల్ల కలిగే లాభాలు
ఉసిరిని ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు.
ఆమ్లాలో విటమిన్ సి, విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, పోటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి గుణాలు ఉన్నాయి.
ఉసిరిలో ఉండే విటమిన్- సి రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది.
ఉసిరికాయను రోజు తీసుకోవడం ద్వారా జీర్ణం త్వరగా అవడంతో పాటు పొట్టలో గ్యాస్ తదితర సమస్యలు దూరం అవుతాయి.
ఉసిరి కాయ తినడం వల్ల ఆస్టియోపోరోసిస్, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఉసిరికాయ తినడం వలన జలుబు, ఫ్లూ, అల్సర్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఉసిరిలో ఉండే క్రోమియం బీటా బ్లాకర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల గుండె దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
ఉసిరికాయ రసం తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది.