కొంతమంది రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు. మరికొందరు 3సార్లు కూడా చేస్తారు. తద్వారా ఎంతో ఆరోగ్యం లభిస్తుంది అనుకుంటారు.

రోజూ స్నానం ఎన్నిసార్లు చెయ్యాలి అనే ప్రశ్నకు ఆరోగ్య నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

ఒక్కమాటలో చెప్పాలంటే చలికాలం రోజూ స్నానం చెయ్యవద్దు అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.

పరిశోధకుల ప్రకారం చలి ఎక్కువగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా స్నానం చేయాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే మన చర్మానికి.. స్వయంగా శుభ్రం చేసుకునే సామర్థ్యం ఉంది. శరీరానికి చెమట పట్టకపోతే దుమ్ము, ధూళి చర్మంపై పేరుకుపోదు.

అందువల్ల మనకు అసౌకర్యంగా ఉండదు. కాబట్టే చలికాలంలో రోజూ స్నానం చేయాల్సిన అవసరం ఉండదు.

బాగా వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం పగిలిపోయినట్లు అవుతుంది.

చలికాలం ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది.

 సాధారణంగా చర్మాన్ని కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడానికి ఈ మంచి బ్యాక్టీరియా ఒక రక్షణ పొరగా పనిచేస్తుంది.

బయటి వాతావరణాన్ని బట్టి రెండు, మూడు రోజులకు ఒకసారి స్నానం చేసినా సరిపోతుందని సూచిస్తున్నారు.