ఓవర్ నైట్ లో స్టార్  అయ్యిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఆ ఫేమ్ ను కాపాడుకుంటూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా మలుచుకుంటున్న వారు కొందరు ఉన్నారు.

ఒక్కసారి కన్ను గీటి కుర్రాళ్ళ మనస్సులో స్థానం సంపాధించుకుంది వయ్యారి భామ ప్రియా ప్రకాష్ వారియర్. మళయాలంలో లవ్ సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది.

అదే సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో ప్రియా ప్రకాష్ కన్ను గీటుతుంది. ఆ సీన్ అప్పట్లో ఓ ఊపు ఊపింది.

కుర్రాలంతా ఆ సీన్ కు ఫిదా అవ్వడమే కాదు సోషల్ మీడియాను కూడా షేక్ చేశారు. అయితే

తాజాగా ప్రియా మాట్లాడుతూ.. ఆ సీన్ తో ఎంత క్రేజ్ వచ్చిందో.. అంతే నెగిటివిటి కూడా వచ్చింది అన్నారు.

చాలా మంది ఆ సీన్ ను రకరకాలుగా వాడుకొని నన్ను ట్రోల్ చేశారు. ఆసమయంలో నా పై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ నన్ను చాలా భాదపెట్టాయి.

అంతే కాదు ఆ సీన్ కారణంగా పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి అని చెప్పుకొచ్చింది ప్రియా.