ఆ సీనియర్ హీరోతో కాజల్ రొమాన్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. 

Rajeev 

17 July 2024

 చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. 

లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఈ చిన్నది టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత చందమామ సినిమాతో హిట్ కొట్టింది. 

మగధీర సినిమాతో భారీ హిట్ అందుకొని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది అందాల భామ చందమామ. 

ఇటీవలే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. 

అలాగే సత్యభామ అనే థ్రిల్లర్ మూవీలో నటించింది కాజల్ అగర్వాల్. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

ఇక ఇప్పుడు ఈ అమ్మడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 3లో కనిపించనుంది. 

కమల్ హాసన్ కాజల్ అగర్వాల్ తో రొమాంటిక్ సీన్స్ ఉంటాయని కొందరు అంటున్నారు. ట్రైలర్ చూస్తే అలానే ఉంది. 

దాంతో చందమామ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తండ్రి వయసున్న నటుడితో రొమాన్స్ అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.