హీరోయిన్‌ జ్యోతిక వెబ్‌సిరీస్‌ ఎంట్రీ ఖరారు అయినట్లుగా సమాచారం

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి హిందీ ప్రొడక్షన్ కంపెనీ ఎక్సెల్‌ ఎంటర్‌టైన్మెంట్‌పై ఓ వెబ్‌సిరీస్‌ నిర్మిస్తున్నారు

నిర్మాతలు ఫర్హాన్‌ అక్తర్, రితేష్‌ సద్వానీ ఈ వెబ్‌సిరీస్‌ని సంయుక్తంగా నిర్మించనున్నారు

సోనాలీ బోస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్‌లో లీడ్‌ రోల్ లో జ్యోతికను అనుకున్నారట మూవీ మేకర్స్‌

స్క్రిప్ట్‌ నచ్చడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారని సమాచారం

ఐదుగురు గృహిణులు రహస్యంగా ఓ వ్యాపారాన్ని మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అన్నది కథ

ఇది నిజమైతే జ్యోతిక నటించే తొలి వెబ్‌సిరీస్‌ ఇదే అవుతుంది

అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది