వెండి మన శరీరానికి తగిలితే ఒక రసాయన చర్య జరుగుతుంది అలానే విడుదలయ్యే ఎలక్ట్రాన్స్‌ కాలి భాగంలో ఉండే నరాలని ఒత్తిడికి గురిచేయడం జరుగుతుంది.

దీనితో నరాల్లో విద్యుత్‌ ప్రవహించి శరీరంలో ఉన్న అసమతుల్య తలను క్రమ బద్ధీకరించడానికి సహాయ పడుతుంది.

అలానే కాళ్ళకి వెండి వట్టీలను పెట్టుకుంటే వాత, పిత్త, కఫ దోషాలు అదుపులో ఉంటాయి.

గర్భసంచికి సంబంధించిన సమస్యలు తగ్గి గర్భసంచి ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే పట్టేలని పెట్టుకోవాలని అంటారు.

వెండి వట్టేలను పెట్టుకోవడం వలన నెలసరి సమస్యలు కూడా రావు. మహిళలు ఆరోగ్యంగా ఉండొచ్చు.

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆడవాళ్లు పీరియడ్స్‌ సమస్యతో బాధపడుతున్నారు..

నెలసరిలో ఇబ్బందులు ఎదుర్కోవడం లేదంటే నెలసరి ఆలస్యంగా రావడం ఇటువంటివి.

ఇటువంటి సమస్యలు ఉన్న ఆడవాళ్లు వట్టేలను ధరిస్తే ఆయా సమస్యల నుండి బయట పడేందుకు అవసరమౌతుంది.

మానసిక ఒత్తిడి వలన ఉత్పన్నమవుతున్న హార్మోన్‌ ఇంబాలెన్స్‌ కూడా వట్టీలని ధరించడం వలన తగ్గించొచ్చు.