హిందూ సంప్రదాయంలో కుంకుమ బొట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది

కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటారు

రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞా చక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు

ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం

అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు

ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతి లో గురువుల నమ్మకం

ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేప్పుడు నొక్కడం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతం అవుతాయి