ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే బొప్పాయి అత్యంత పోషకాలు కలిగిన పండ్లలో ఒకటి. దీన్ని సలాడ్‌లలో కలుపుకొని తినవచ్చు

ఉదయం లేదా భోజనం తర్వాత దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి బాధలు తగ్గుతాయి

అయితే గర్భిణులు మాత్రం బొప్పాయి అస్సలు తినకూడదు. ఎందుకో తెలుసుకుందాం

గర్భిణీల ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం

కానీ బొప్పాయి పండుని ఈ జాబితా నుంచి మినహాయించాల్సిన అవసరం ఉంది

ఈ పండులో లేటెక్స్ ఉంటుంది ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల నెలలు నిండకముందే ప్రసవానికి గురయ్యే అవకాశం ఉంది

ఇది పాపైన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది పిండానికి మద్దతు ఇచ్చే పొరను బలహీనపరుస్తుంది