ప్యాసింజర్ రైళ్లతో పోలిస్తే, గూడ్స్ రైళ్లు చాలా పొడవుగా ఉంటాయనే విషయం మీరెప్పుడైనా గమనించారా

అంతేకాకుండా ప్యాసింజర్ రైళ్లలో తక్కువ కోచ్‌లు ఉంటాయి. అదే గూడ్స్ రైళ్లకైతే ఎక్కువ కోచ్‌లు ఉంటాయి

ఎందుకు ఈ వ్యత్యాసమనే సందేహం కూడా మీకు వచ్చివుంటుంది. మీ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం

సాధారణంగా ఇండియన్‌ ట్రైన్ల పొడవు, రైల్వే ప్లాట్‌ఫారమ్ పొడవుపై ఆధారపడి ఉంటుంది

ప్లాట్‌ ఫారమ్‌ పొడవును లూప్ లైన్ అని అంటారు. రైలు పొడవు – లూప్ లైన్ పొడవును మించకూడదన్నమాట

ఇక ప్లాట్‌ఫారమ్‌పై ఆగే రైళ్లు లూప్‌లైన్‌లో సరిపోతాయి. అప్పుడు మాత్రమే మెయిన్‌లైన్‌కు చేరుకునే ఇతర రైలు సౌకర్యవంతంగా ప్రయాణించగలదు

ప్రమాదాలు జరగకుండా నివరించడంలోనూ ఇది బాగా పనిచేస్తుంది

రైలులోని అన్ని కోచ్‌లు ప్లాట్‌ఫారమ్‌పై సులభంగా చేరుకోవడానికి వీలుగా ప్లాట్‌ఫారమ్ కంటే పొడవుగా కోచ్‌లు ఉండకుండా జాగ్రత్త పడతారు