లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు పెళ్లి తర్వాత కలిసిరావడం లేదని అనిపిస్తోందంటున్నారు ఆమె ఫ్యాన్స్‌.

ఇంతకి అసలు సంగతి ఏంటంటే.. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటూ.. ఇటీవలే బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేసింది నయన్‌.

హిందీలో షారూఖ్‌ ఖాన్‌కి జంటగా నటించిన జవాన్‌ చిత్రం, తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న ఇరైవన్‌ చిత్రం షూటింగ్‌ ఇటీవల పూర్తి చేసుకున్నాయి.

వీటి విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈమెకు తర్వాత చిత్రం ఏంటి అన్న ప్రశ్న ఎదురవుతోంది.

దీనికి కారణం కొత్త చిత్రాలేవీ చేతిలో ఏమీ లేకపోవడమే.

అధిక పారితోషికం డిమాండ్‌ చేయడంతో అంగీకరించిన చిత్రాలు సైతం వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నయనతార ఇటీవల నటించిన ఆ తరహా చిత్రాలు నిరాశపరిచాయి.

మరో విషయం ఏంటంటే నయనతార ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో రెండు లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు చేయడానికి అంగీకరించారని.

అందుకు ఒక్కో చిత్రానికి రూ. 10 కోట్లు చొప్పున రెండు చిత్రాలకు రూ. 20 కోట్లు డిమాండ్‌ చేశారని సమాచారం.

అయితే అడ్వాన్స్‌ తీసుకుని రెండేళ్లుగా కాలయాపన చేయడంతో వారు చిత్రాలను నిలిపివేయడమే కాకుండా.. నగదు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది.