మనలో చాలామందికి ఎక్కిళ్లు వస్తుంటాయి. అయితే వీటికి చాలామంది పలు కారణాలు చెబుతుంటారు

అవి వచ్చినప్పుడు మనల్ని ఎవరైనా కావాల్సిన వాళ్లు బాగా తలచుకుంటున్నారని అనుకుంటుంటాం

కానీ, శాస్త్రవేత్తలు మాత్రం అసలు విషయాన్ని కనిపెట్టారు

ఇది మనలోని కండరాల అసంకల్పిత చర్య వల్ల వస్తున్నట్లు పేర్కొన్నారు

డయాఫ్రాగమ్ కండరాలు అకస్మాత్తుగా కుదింపులకు గురైనప్పుడు మీరు దానిని నియంత్రించలేరు. అప్పుడు మీకు ఎక్కిళ్లు వస్తాయి

కానీ, కొంత సమయం తర్వాత ఈ ఎక్కిళ్లు ఆగిపోతాయి. అంతే కాకుండా స్పైసీ ఫుడ్ కూడా ఎక్కిళ్లకు కారణమని భావిస్తున్నారు

చాలామందికి ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా చాలా ఉత్సాహంగా ఉన్నప్పుడు లేదా తరచుగా ఆహారం తిన్నప్పుడు కూడా ఎక్కిళ్లు వస్తుంటాయి

కొన్నిసార్లు ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే మాత్రం సమస్యగా ఉంటే, మీరు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి