రామ భక్త హనుమంతుడి వివిధ పేర్లతో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పూజలను అందుకుంటున్నాడు

హనుమంతుడిని పూజించడం వలన తమ కష్టాలు తీరతాయని భక్తుల నమ్మకం

అయితే మనదేశంలో ఓ ప్రాంతంలో హనుమంతుడికి పూజించరు సరికదా అక్కడ ఆయన పేరుని తలచినా  నేరంగా పరిగనిస్తారు

మరి ఎందుకు అక్కడ హనుమంతుడిని పూజించరో తెలుసుకుందాం

ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న దునగిరి గ్రామంలో ఒక నమ్మకం ఉంది

రామాయణ కాలంలో హనుమంతుడు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుని చికిత్స కోసం సంజీవని పర్వతాన్ని తమ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళారని ఈ ప్రాంతవాసుల నమ్మకం

అప్పటి నుండి ఇక్కడి ప్రజలకు తమకు సంజీవనిని దూరం చేసిన హనుమంతుడు అంటే చాలా కోపం. ఆయనను ఎప్పుడూ పూజించరు

కనీసం పేరు కూడా పలకరు.. నేటికీ, ఈ గ్రామంలో హనుమంతుని పూజించడం నేరంగా పరిగణించబడుతుంది