హిందూ సంప్రదాయం ప్రకారం.. కాకులను పూర్వీకుల రూపంగా భావిస్తారు

పిండప్రదానం చేసేటప్పుడు కాకి వెనుక భాగంలో కూర్చుంటే చాలా శుభసూచకమని నమ్ముతారు

ఎందుకంటే మన పూర్వీకులు మన కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా చెబుతారు

కాకికి సంబంధించిన ఒక కథ త్రేతాయుగం నాటిది

ఇంద్రుని కుమారుడు జయంత్ కాకి రూపంలో సీత కాలికి గాయం చేస్తాడు. ఇది చూసిన రాముడు కాకి కన్ను పొడిచేస్తాడు

తర్వాత జయంత్ తన తప్పును గ్రహించి శ్రీరాముడిని క్షమాపణ కోరుతాడు

అప్పుడు రాముడు అతడిని క్షమించి ఈ రోజు తర్వాత మీకు ఇచ్చిన ఆహారం పూర్వీకులు అందుకుంటారని చెబుతాడు

అప్పటి నుంచి కాకిని పూర్వీకుల రూపంగా భావిస్తారు

పర్యావరణ ప్రభావం ఇప్పుడు జంతువులు, పక్షులపై కూడా కనిపిస్తుంది. చాలా పక్షులు అంతరించిపోతున్నాయి

ఈ విషయంలో జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే ఒకవేళ కాకి రాకపోతే కనిపించిన పక్షికి ఆహారం పెట్టవచ్చని చెబుతున్నారు