అయ్యప్పస్వామి ప్రత్యేకమైన పాట ఏమిటంటే పవళింపు పాట
ఈ పాట ఎంత విన్నా తనివి తీరదు. శబరిమల మణికంఠుని సన్నిదానంలో అయితే తన్మయత్వంలో పులకించుకోక తప్పదు
అయ్యప్పస్వామి హరివరాసనం పాట గాయకుడు యెసుదాసు పాడిన పాట. అయ్యప్పస్వామికి పవళింపుగా ఈ పాటను ఆలపిస్తారు
ఇంతకి ఆ పాట ఎలా పుట్టింది.. ఎవరు రచించారు.. మొదటగా ఎవరు పాడారు..
శబరిమలలో అయ్యప్ప పూజలు చేసిన తర్వాత చివరగా ఈ పాటను పాడటం ఒక సాంప్రదాయం
ఇదే విధానాన్ని ఇతర అయ్యప్ప ఆలయాల్లోనూ.. ఇతర పూజా కార్యక్రమాల్లో, ఉత్సవాల్లో ఆలపిస్తుంటారు
ఈ అయ్యప్ప స్వామి పవళింపు స్తోత్రాన్ని కుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారు
1955లో స్వామి విమోచనానంద అయ్యర్ మొదట ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారట