దేశంలో పాముకాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.

2000 సంవత్సరం నుంచి 2019 వరకు అంటే 20 ఏళ్లలో ఏకంగా 12 లక్షల మంది పాముకాటుతో మృతిచెందారని తెలిపింది.

అంటే ఏటా సరాసరి 58 వేల మంది చనిపోయారని, పోస్ట్‌మార్టం నివేదికల ఆధారంగానే ఈ లెక్కలు వేసినట్లు స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017లో 1,068 మంది, 2018లో 1,060 మంది, 2018లో 885 మంది పాముకాటుతో తెలిపింది.

 కానీ కేంద్రం లెక్కిస్తున్న దానికన్నా పాముకాటు మృతుల సంఖ్య 60 రెట్లు అధికంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో నివేదిక పేర్కొంది.

దేశంలో ఏటా 15 లక్షల వయల్స్‌ యాంటీవీనం ఉత్పత్తి అవుతున్నాయి

పాముకాటు బాధితుడికి అవసరాన్ని బట్టి 10 నుంచి 20 వయల్స్‌ అవసరమవుతాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

అంటే ఏటా కేవలం లక్ష మంది పాముకాటు బాధితులకే విరుగుడు మందు అందుబాటులో ఉందని వివరించింది.