ఈ మధ్యకాలంలో చాల మంది ఇళ్ళల్లో , ఆఫీస్ ల్లో , మరియు వారికి ఇష్టమైన ప్రదేశాల్లో లాఫింగ్ బుద్ధా బొమ్మలు ఉంచుకోడటం చూస్తున్నాం..

రకరకాలుగా మోడల్స్ తో మార్కెట్ లో విక్రయం అవుతున్న లాఫింగ్ బుద్ధా బొమ్మలు చూస్తున్నాం.

ఇంతకీ ఈ లాఫింగ్ బుద్ధా ఎవరు..? అతని నవ్వు వెనుక అసలు కారణం ఏంటో , లాఫింగ్ బుద్ధా బొమ్మను అదృష్టంగా బావిస్తుంటారో చాలామందికి తెలియదు.

బౌద్ధ మత సందేశం ప్రకారం కోరికలు , మొహాలతో కాకుండా కేవలం ధ్యానంలో గడపడమే బౌద్ధమత సారం.అయితే..

బుద్ధుడికి ఉన్న శిష్యుల్లో ఒకరైన హోతేయి.. జపాన్ దేశానికీ చెందిన ఈ వ్యక్తి జ్ఞానానికి రూపంగా , జ్ఞానాన్ని ప్రజలకు అర్ధం అవ్వాలంటే నవ్వుతూ , నవ్విస్తూ ఉండాలి అనే వారు.

ఇతను ఎక్కడకి వెళ్లిన తన చుట్టూ అందరిని నవ్వుతూ , నవ్విస్తూ ఉండేవారు.. అందుకే జపాన్ ప్రజలు అతనిని లాఫింగ్ బుద్ధా అని పిలిచేవారు.

లాఫింగ్ బుద్ధా అనే పేరు చైనా లో కూడా బాగా ఫెమౌస్. ఇక్కడ లాఫింగ్ బుద్ధా ను దైవంగా భావిస్తారు.మరియు అదృష్టం కోసం లాఫింగ్ బుద్ధా ను వారు ఇళ్లల్లో ఉంచుకుంటారు.

అయితే లాఫింగ్ బుద్ధా కూడా చాల మంది శిష్యులు ఉన్నారు. వారు లాఫింగ్ బుద్ధా యొక్క జీవన మార్గాలను ప్రబోధిస్తూ ఉంటారు.

ఇప్పుడు మన దేశంలో కూడా ఈ లాఫింగ్ బుద్ధా బొమ్మలు కామన్ గా కనిపిస్తున్నాయి.