ప్రపంచానికి ఊపిరి ఆగిపోయినంత పనైంది. వాట్సాప్ పనిచేయకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
గంటన్నర సేపు వాట్సాప్ ఏమాత్రం పనిచేయలేదు. పది నిమిషాలు, పావు గంటలో సమస్య పరిష్కారం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ..
చూస్తున్నంతలోనే సమయం భారంగా గడిచిపోయింది. నిమిషాలు గంటగా మారాయి. అయినా వాట్సాప్ బాగవలేదు. టెక్ ఎక్స్‌పర్ట్స్ అవాక్కయ్యారు.
వాట్సాప్ పనిచేయకపోపవడం ఒక ఎత్తయితే.. గంటన్నర సేపయినా సమస్యను ఫిక్స్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో నెటిజన్లు మీమ్స్‌తో వాట్సాప్‌ను ఆటాడుకున్నారు.
దీంతో మెటావర్ సంస్థ స్పందించాల్సి వచ్చింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి.. వాట్సాప్ సేవలు పునరుద్దరిస్తామంటూ చెప్పింది.
ఇంతలో గంటన్నర తర్వాత వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.