టీ లేకుండా చాలామంది రోజును ప్రారంభించరు.. పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు చాలాసార్లు టీ తాగేవారున్నారు

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంతో టీ తాగుతారు. అయితే, అతిగా టీ తాగడం మాత్రం హానికరం..

టీ తర్వాత నీళ్లు తాగడం చాలా ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని వివిధ భాగాలు దెబ్బతింటాయి.

టీ తాగిన వెంటనే నీరు తాగితే, దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. దంతాలు రుచిని పసిగట్టలేవు. ఇది దంతాల నరాలపై కూడా ప్రభావం చూపుతుంది.

టీ తాగి నీళ్లు తాగడం వల్ల అల్సర్ సమస్య మొదలవుతుంది. ఎసిడిటీ సమస్య కూడా వేధిస్తుంది

టీ తర్వాత నీరు తాగడం వల్ల ముక్కు నుంచి రక్తం కారుతుంది. శరీరం చలిని, వేడిని తట్టుకోలేకపోతుంది. వేసవిలో ఈ సమస్య తీవ్రమవుతుంది.

టీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి.