చికెన్ ను ఇష్టపడని వారెవరుంటారు.. మాంసహరులు ప్రతి వారంలో ఒక్కసారైనా తమ ఆహారంలో చికెన్ డిష్ జోడించుకోకుండా ఉండరు.
సాధారణంగా చికెన్ కొనడానికి దుకాణానికి వెళ్లగానే కొంతమంది స్కిన్ లెన్ చికెన్, మరికొంత మంది స్కిన్‌తో ఉన్న చికెన్ కొనుగోలు చేస్తారు.
కొంతమంది స్కిన్‌తో ఉన్న చికెన్ నచ్చదు. స్కిన్ చికెన్, స్కిన్ లెస్ చికెన్ ధరల్లో కూడా స్వల్పమార్పులు ఉంటాయి.
భారత్ లో అయితే ఈ వినియోగం 41 లక్షల టన్నుల కన్నా ఎక్కువగానే ఉందని తెలిపింది.
కొవ్వు తక్కువుగా ఉండటం, పోషకాహార పదార్థాలు ఎక్కువుగా ఉండటంతో పాటు శరీరానికి ప్రయోజనం కలిగించే మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు కోడి మాంసంలో గణనీయంగా ఉంటాయి.
ఈ కొవ్వులు గుండె సంబంధిత ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చికెన్ తినేటప్పుడు స్కిన్‌తో తినడం మంచిదా.. స్కిన్ లెస్ చికెన్ మంచిదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
చికెన్ స్కిన్‌లో 32 శాతం కొవ్వు ఉంటుంది. అంటే ఒక కిలో చికెన్ స్కిన్‌ను తింటే అందులో 320 గ్రాముల కొవ్వు ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
చికెన్ స్కిన్‌లో ఉండే కొవ్వుల్లో మూడింట రెండొంతులు అసంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటినే మంచి కొవ్వుగా పిలుస్తారు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడటంలో ఈకొవ్వు సహాయపడుతుంది.