పంటి నొప్పి.. ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంది

ఇక ఒక్కోసారి రెండు మూడు రోజులకు కూడా ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంటే డాక్టర్లను సంప్రదిస్తారు

అయితే నొప్పి మరింత ఎక్కువగా కాకముందే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే నొప్పిని తగ్గించుకోవచ్చు

ఉప్పు నీటితో మౌత్ వాష్ చేసుకుంటే పంటి నొప్పి సమస్య తగ్గిపోతుంది

తాజా వెల్లుల్లి రెమ్మని నెమ్మదిగా నమిలినా కూడా పంటి నొప్పి తగ్గిపోతుంది

ఒక చిన్న గ్లాసు నీటిలో కొన్ని చుక్కల లవంగం నూనె వేసి మౌత్ వాష్ లాగా ఉపయోగించవచ్చు

తాజా జామాకులు నమలండి లేదా కొన్ని జామాకులని కొద్దిగా దంచి వాటిని మరుగుతున్న నీటిలో వేసి మౌత్ వాష్ తయారు చేసుకోండి

డాక్టర్లను ఎప్పుడు కలవాలంటే.. పంటినొప్పితో పాటు జ్వరం, రెండు రోజుల కంటే ఎక్కువ నొప్పి, మింగడంలో ఇబ్బంది, వాపు, కొరికినప్పుడు నొప్పి, చిగుళ్లు ఎర్రగా ఉండడం