మారుతున్న కాలానికి అనుగుణంగా మానవులు తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు

ముఖ్యంగా మాంసాహారులు క్రమంగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ శాఖాహారులుగా మారుతున్నారు

ఎక్కువమంది మాంసం, జంతువుల నుంచి వచ్చే పాల పదార్ధాలను, జంతు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకుంటూ వేగన్ గా మారుతున్నారు

అయితే శాఖాహార పాలు మొక్కల ఉత్పత్తులనుంచి తయారు చేస్తారు

మొక్కల నుంచి సేకరించిన ఈ పాలు కూడా జంవుతుల నుంచి సేకరించిన పాలు వలే రుచి, ఆరోగ్యాన్నిచ్చే లక్షణాలు కలిగి ఉంటాయి

తక్కువ ఖర్చు, ఆరోగ్యానికి ఆరోగ్యం .. వివిధ పదార్ధాల తయారీ .. ఇన్ని ప్రయోజనాలు ఇచ్చే వేగన్ పాల పై  ప్రస్తుతం ప్రపంచ జనాభా దృష్టి సారిస్తుంది

సోయా బీన్స్ నుంచి తయారు చేసిన సోయా మిల్క్ లో అనేక ఔషద గుణాలు ఉన్నాయి

శాకాహారి పాలలో రెండవ ప్రసిద్ధ ఎంపిక, మార్కెట్ లో లభించే మరో శాఖాహార పాలు బాదం మిల్క్

పాలు అలెర్జీ ఉన్న పిల్లలకు, పెద్దలకు బాదం పాలు మంచి  ప్రత్యామ్నాయమని పరిశోధకులు సూచించారు

కొబ్బరి పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు ఈ పాలల్లో విటమిన్ డి, బి 2, బి 12, కాల్షియం వంటివి పుష్కలంగా ఉన్నాయి