దుంప కూరల్లో ఒకటి చేమదుంప.. బంగాళా దుంప తిన్నంత ఇష్టంగా చేమదుంపల్ని తినరు

ముఖ్యంగా చేపదుంపలు జిగురుగా ఉంటాయని తినడానికి ఆసక్తి చూపించరు

అయితే ఈ చేమదుంపలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మీకు తెలుసా

చేమ దుంపల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది

వీటిల్లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్ల కాంబినేషన్‌ ధమనుల్లో కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది

చేమదుంపల్లో విటమిన్‌ బి-6 , ‘ఇ’ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి

చేమ దుంపలు తినడం వలన మహిళలోని ఎండోక్రైన్‌ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. గర్భిణీలకు నీరు పట్టడం, వికారంగా ఉండే లక్షణాలను చామదుంపలు తగ్గిస్తాయి

రాత్రివేళ చెమట, గొంతు తడి ఆరటం, హాట్‌ ప్లషెస్‌ వంటి లక్షణాలు చేమదుంపల వల్ల తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు