వాస్తు శాస్త్రంలో.. ఇంట్లో సానుకూలతను పెంచడానికి, ప్రతికూలతను తొలగించడానికి అనేక ప్రత్యామ్నాయాలు, చర్యలు ఉన్నాయి
అలాంటి వాటి ప్రత్యామ్నాయాల్లో పిరమిడ్ కూడా ఒకటి
ఇంట్లో పిరమిడ్ ఉంటే మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మరి ఇంట్లో పిరమిడ్ ఉండటం వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం
ఇంట్లో పిరమిడ్ ఉంచడం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది
బాగా అలసిపోయిన వ్యక్తి పిరమిడ్ దగ్గర కొంత సమయం పాటు కూర్చుంటే వారిలో సరికొత్త ఎనర్జీ శరిరంలో జనిస్తుంది
వాస్తు శాస్త్రం ప్రకారం.. పిరమిడ్‌ను ఉత్తరం వైపు ఉంచడం వల్ల సంపద, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది
పిరమిడ్ మన శరీరానికి కొత్త శక్తిని ఇవ్వడంతో పాటు.. ఏకాగ్రతను పెంచుతుంది