ఖర్జూర పండ్ల ఎంత ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయో.. అదే విధంగా ఖర్జూరం గింజలు కూడా అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి
ఖర్జూరం గింజలను అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు
ఖర్జూరం గింజల్లో కూడా చాలా పోషక విలువలను కలిగి ఉన్నాయి
అయితే ఈ గింజలను నేరుగా తినలేరు కనుక.. ఖర్జూరపు గింజల పొడిని ఉపయోగిస్తారు
ఖర్జూరం గింజల పొడి అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, జింక్, కాడ్మియం, కాల్షియం , పొటాషియంతో కూడిన సమ్మేళనాలను కలిగి ఉంటుంది
ఈ గింజలు DNA దెబ్బతినకుండా నిరోధించడం, రక్తంలో చక్కెర సమస్యల చికిత్సలో ఉపయోగపడతాయి
ఖర్జూర విత్తనాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి
ఖర్జూరపు గింజల పొడి జీర్ణశయాంతర రుగ్మతలకు, ముఖ్యంగా దీర్ఘకాలిక విరేచనాలకు చికిత్స గా పనిచేస్తుంది