శాకాహారులు కూడా చాలా ఆహారాల ద్వారా ఈ ప్రొటీన్‌ని పొందవచ్చు

గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్లను అందించే శాఖాహార ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం

100 గ్రాముల గుమ్మడికాయ గింజలలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు,  కొవ్వులు, విటమిన్ Kతో పాటు 19 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తాయి

100 గ్రాముల శెనగలలో 19 గ్రాముల ప్రొటీన్‌ను ఉంటుంది. గరిష్ట ప్రయోజనాల కోసం రోటీలు, అన్నంతో కలిపి తింటే చాలా మంచిది

పనీర్‌లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌లో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది

సాధారణ పెరుగుకు విరుద్ధంగా గ్రీకు పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇందులో దాదాపుగా 23 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుంది

సోయాబీన్స్ అనేది ప్రోటీన్లకు మంచి మూలమని చెప్పవచ్చు. ఒక కప్పులో 29 గ్రాముల మాక్రోన్యూట్రియెంట్‌ను అందిస్తుంది