పరమపవిత్రమైన అయ్యప్ప దీక్ష 41 రోజులు పూర్తయిన తర్వాత శబరిమలైకి బయలుదేరే స్వామివారికి సమర్పించేందుకు తీసుకెళ్లేదే ఇరుముడి

ఇరుముడి అంటే రెండు ముళ్లు కలదని అర్ధం

ఒక కొత్త బట్టను రెండు ముళ్లు వచ్చే విధంగా కుట్టించి భక్తి శ్రద్దలతో ఆలయ ప్రాంగణంలో గురుస్వాములచే ఇరుముడిని కట్టుకుంటారు

ముందు ముడిలో దేవుడికి సంబంధించి సామాగ్రి, వెనుక ముడిలో ఇతర సామాగ్రి ఉంటాయి

ఒక కొబ్బరి కాయలోని నీటిని తొలగించి ఫలాన్ని ఆవునెయ్యితో నింపుతారు

తర్వాత దానిని శుభ్రతతో మూటకట్టి ఇరుముడి ముందు భాగంలో పెడతారు

అలాగే నాలుగు కొబ్బరి కాయలు, పూజాసామాగ్రిని చేర్చుతారు

ఇదే స్వామి వారికి సమర్పించే ఇరుముడి