అన్ని రకాల కూరగాయలు తినడం శరీరానికి మంచిది
సొరకాయని వండుకొని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్ అధిక ఉండడం వల్ల శరీరానికి మంచిది
సొరకాయ తినడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు
సొరకాయ తినడం వల్ల గ్యాస్ ట్రబుల్స్, పొట్టలో సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది
సొరకాయను తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరతను తగ్గించి.. డీహైడ్రేషన్ బారినపడకుండా కాపాడుతుందట
సొరకాయ తినడం వల్ల బరువు కూడా సులభంగా తగ్గొచ్చట
అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది