మిగతా పోషకాల మాదిరిగా శరీరానికి చక్కెర కూడా అవసరం. దాన్ని ఏదొక రూపంలో నిర్దిష్ట మోతాదులో తీసుకోవాలి

శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గకుండా ఉండేందుకు అందరూ కనీసం రోజుకొక స్వీట్ అయినా తింటారు

చక్కెరలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి శుద్ధి చేసిన చక్కెర కాగా, మరొకటి సహజ చక్కెర

వీటిల్లో సహాజ చక్కెర మీ శరీరానికి చాలా అవసరం. అది మీ శక్తి సామర్ధ్యాలను పెంచడమే కాకుండా దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యం సైతం పెరిగేలా చేస్తుంది

శుద్ధి చేసిన చక్కెర మీ శరీరానికి అనేక విధాలుగా హని చేస్తుంది

డ్రగ్స్ మానేసిన తర్వాత ఎలా అయితే ఉంటుందో.. షుగర్‌ను పూర్తిగా మానేసినప్పుడు కూడా సరిగ్గా అలాగే ఉంటుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది

దీని వల్ల మీ శరీరంలో అలసట, తలనొప్పి, మెడ తిమ్మిర్లు, చిరాకు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవే కాకుండా మీ కడుపుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది

మంచి అనుభూతినిచ్చే హార్మోన్లు, డోపమైన్, సెరోటోనిన్‌లు చక్కెర నుంచి విడుదలవుతాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరం