ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తి కలలో తూర్పు నుండి పడమరకు కాకి ఎగురుతున్నట్లుగా కనిపిస్తే, అతను త్వరలో సంపదను పొందుతాడని విశ్వాసం

ఒక విద్యార్థి ఏదైనా పరీక్ష, పోటీకి సిద్ధమవుతున్నప్పుడు వారి కలలో కాకి పెరుగు, వెన్న తింటున్నట్లుగా కనిపిస్తే అది శుభ సూచకంగా భావించాలి

కలలో వలలో చిక్కుకున్న కాకి ఏదో విధంగా ఆ ఉచ్చు నుండి విముక్తి పొంది ఎగిరిపోయినట్లు కనిపిస్తే.. ఆ వ్యక్తి త్వరలోనే తన శత్రువులపై విజయం సాధిస్తాడని అర్థం

వ్యాపార స్థలంలో కాకి కూర్చున్నట్లుగా రాత్రి సమయంలో వ్యక్తికి కల వస్తే.. ఆ వ్యక్తి వ్యాపారంలో అనూహ్యమైన విజయం సాధిస్తాడు

పెళ్లికాని యువకుడు, పెళ్లికాని అమ్మాయి కలలో కాకి తన ఇంటి వెనుక కూర్చొని ఉన్నట్లుగా కినిపించినట్లయితే.. వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది

ఒక నిరుద్యోగి కలలో కాకి పెరుగు తినడం కనిపిస్తే.. త్వరలోనే అతనికి ఉపాధి లభిస్తుంది