నీ మరణం తరువాత ఏమి జరుగుతుందో చూడు...
అంత్యక్రియలకు వెళ్ళినవారు ఇంటికి తిరిగివస్తారు. కొద్దిగంటల్లో రోదనలన్నీ పూర్తవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు చవుకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరా తీస్తుంటారు.
పక్కింటి నీ ప్రాణస్నేహితుడు పాడే కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటిముందు వేశారని విసుక్కుంటాడు. మూడోరోజున ఢిల్లీలో ఉండే నీ చిన్నకొడుకు సెలవు లేదు వెళ్లాలని తొందరపడుతుంటాడు.
అతను వెళ్లేలోగా దినం ఖర్చులు తెల్చేస్తే బాగుండునని పెద్దకోడలు భర్తను పోరుపెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్దకూతురు తొందరపడుతుంది.
నీ కారు తనకు ఇస్తే బాగుండునని నీ చిన్నకూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియకనీ సెల్ ఫోన్‌కు వచ్చే కాల్ఫ్‌నినీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు.
పదకొండో రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించి వెళ్ళిపోతారు.
పదకొండో రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించి వెళ్ళిపోతారు.
నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్కచిక్కి పోతుంది. మెల్ల మెల్లగా నీ మరణం పాతబడుతుంది.
నిన్ను క్రమక్రమంగా అందరూ మరచిపోతారు. ఆస్తుల వంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరీకానికి ఎవరూ రారు.
అందుకే...బ్రతికినంత కాలం గౌరవంగా బ్రతుకు, నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డపేరు తెచ్చుకుని సంపాదించి ఇచ్చినా చివరకు జరిగేది. ఇదే,