కొంతమంది భార్యలు వాళ్లభర్తలను చీటికిమాటికి అనుమానిస్తుంటారు.
ఇంట్లో, ఆఫీస్ లో, బయట ఇలా ఎవరితోనైనా ఎక్కడైనా మాట్లాడితే కొందరు అనుమానం పెంచుకుంటారు.
మీ భార్య కూడా ఇలా చేస్తున్నారా..? పదే పదే మీ భార్య మిమ్మల్ని అనుమానిస్తున్నట్లయితే.. కారణం ఏంటో అడిగి తెలుసుకోండి.
గతంలో జరిగిన ఏవైనా సంఘటన వల్ల, లేకపోతే సమాజంలో చూస్తున్న వాటి వల్ల,
లేకపోతే మీరు తనని వదలి వెళ్లిపోతారనే భయంతో అయినా ఇలా చేయవచ్చు.
ఎట్టిపరిస్థితుల్లో మీ భార్యను మీరు మోసం చేయరనే.. భరోసాతో పాటు నమ్మకం ఇవ్వండి.
ఆఫీస్, ఇంట్లో,బయట వనుల్లో బిజీ అయిపోకుండా మీ భార్యకు కొంత సమయం ఇవ్వండి.
ఇలా చేయడం వల్ల మీ భార్య మారే అవకాశం ఉంటుంది.
వీటితో పాటు ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే తొలగిపోయి సంతోషంగా ఉంటారు.