స్పేస్‌లో పరిశోధనల నిమిత్తం తరచూ భూమి నుంచి పెద్ద సంఖ్యలో వ్యోమగాములు వెళ్లడం సాధారణమైపోయింది

అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వారి జీవితం ఏవిధంగా ఉంటుంది? వారి ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి? వ్యోమగాములు అక్కడ ఎలా నివసిస్తారు? అక్కడ మైక్రోగ్రావిటీ కారణంగా వాళ్లు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు గురించిన సందేహాలు మన మదిలో తరచూ రేకెత్తుతుంటాయి

వ్యోమగాముల జీవితానికి సంబంధించిన ప్రత్యేక సమాచారం మీకోసం

గతంలో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు మెత్తని, పిల్లలు తనగలిగే ఆహారాన్నిమాత్రమే తీసుకువెళ్లేవారు. ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని ట్యూబ్ రూపంలో తీసుకునే వారు

వ్యోమగాములు ఇప్పుడు థర్మో-స్టెబిలైజ్డ్ (హీట్ ప్రాసెస్డ్ ఫుడ్స్), తక్కువ తేమ ఉన్న ఆహారాన్ని తింటున్నారు

వ్యోమగాములు తినే ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటిల్లో నీరు ఉండదు. పండ్లు తిన్నట్టు తినొచ్చు

నీటితో కలిపి తినే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. వీటి తయారీలో ప్రత్యేకంగా డబ్బాల్లో ప్యాక్ చేసి వాటర్ ఇంజెక్షన్లు ఇస్తారు

సహజంగా తినే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో గింజలు ఇతర పదార్ధలుంటాయి. వీటిని కూడా ప్రత్యేకంగా ప్యాక్ చేస్తారు