తలనొప్పి, కడుపు నొప్పి, ఎముకలు, శరీర నొప్పి.. ఇలా నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ట్యాబ్లెట్లను ఉపయోగిస్తారు.
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
తరచూ వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
పెయిన్ కిల్లర్స్ రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. వ్యాధితో పోరాడే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
నొప్పుల మందులు తరచూ తీసుకోవడం వల్ల కాలేయానికి హాని కలుగుతుంది.
గుండె సమస్యలు కూడా వస్తాయి. పెయిన్ కిల్లర్స్ లోని ఔషధం రక్తంలోకి వెళ్లి గుండెపై ప్రభావం చూపుతుంది.
పెయిన్ కిల్లర్స్ తో పేగుల ఆరోగ్యం క్షీణిస్తుంది. కడుపు సమస్యలు పెరుగుతాయి.