మనం ప్రాణాలతో ఉండాలంటే ప్రాణవాయువు అయినా ఆక్సీజన్ ఎంత ముఖ్యమో.. ఆహారం, నీరు కూడా అంతే ముఖ్యం

ఫుడ్ తింటేనే మనుగడ సాగించగలం. లేదంటే చతికిలబడతారు

ఒక్కోసారి ఆకలి అనిపించదు. చాలా రోజులుగా ఆకలి వేయడం లేదంటే.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఆరోగ్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు

ఆకలి లేకపోవడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం

మీరు ఆత్రుతగా, ఆందోళనగా ఉన్నప్పుడు కేంద్ర నాడీ వ్యవస్థ ఒక రకమైన ఒత్తిడికి గురి చేసే హార్మోన్లను విడుదల చేస్తుంది

ఈ అవాంఛిత హార్మోన్లు మీ జీర్ణక్రియ, ఆకలిని మందగించడంతో సహా అనేక విధాలుగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి

డిప్రెషన్, ఒత్తిడి కూడా కొన్నిసార్లు  ఆకలి లేకుండా చేస్తాయి.

అనారోగ్యంతో ఉన్నప్పుడు విడుదలయ్యే సైటోకిన్ అనే రసాయనం వ్యక్తులను అలసిపోయేలా చేస్తుంది. ఏదీ తినాలని అనిపించదు

వృద్ధాప్యంలో జీర్ణవ్యవస్థ మందగించడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో తక్కువ ఆకలి ఉంటుంది