వేగన్ డైట్‌వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో వెల్లడైంది
ఈ రకమైన శాఖాహార డైట్‌ను పాటించడం ద్వారా డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది
ఇక గుండెజబ్బులు రాకుండా ఉండడంతో పాటు, శరీరంలో కొలెస్ట్రాల్ కూడా చేరకుండా ఉంటుంది
ఇది హైబీపీ రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు
శాఖాహార డైట్ వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడడమే కాకుండా కొవ్వు స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు
వేగన్ డైట్ తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల వచ్చే అలర్జీలకు చెక్ పెట్టవచ్చు
వేగన్ డైట్ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది