పండ్లలో అందరికీ ఎప్పటికీ లభించేది,.. సామాన్యులు సైతం కొనుగోలు చెయ్యగల పండు అరటి పండు

ఒక్క అరటి పండు తింటే 3 యాపిల్‌ పండ్లు లేదా ఒకటిన్నర గుడ్డు తిన్నట్లే అంటారు

అరటిపండు తింటే బరువు తగ్గుతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు

అరటి ద్వారా అందే పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది

నిద్రలేమి బాధితులు రాత్రి పడుకోబోయే ముందు పాలతోపాటు అరటి పండు తింటే కంటినిండా నిద్రపడుతుంది

అరటిపండ్లలో పుష్కలంగా లభ్యమయ్యే బి6, సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి

బలహీనంగా ఉన్న పిల్లలకు పాలు, తేనెతో పాటు అరటిపండు తినిపిస్తే తగినంత బరువు పెరుగుతారు

క్రీడాకారులు, కఠినమైన వ్యాయామాలు చేసే వారు అరటిపండు తింటే త్వరగా నీరస పడరు