యాపిల్ పండులాగే కనిపించే పియర్స్ పండ్లు చాలా రుచిగా ఉంటాయి

పియర్స్ పండ్ల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి

రెగ్యులర్‌గా పియర్స్ తినడం వల్ల బరువు తగ్గుతున్నట్లు, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల వంటివి నయమవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది

మామూలుగా డయాబెటిక్స్ ఉన్న వారు అన్ని రకాల పండ్లూ తినకూడదు

పియర్స్ మాత్రం తక్కువ కార్బోహైడ్రేట్స్‌, తక్కువ కేలరీలతో, ఎక్కువ ఫైబర్‌తో అందరూ తినేందుకు వీలవుతోంది

ఇందులో శరీరంలో విషవ్యర్థాల్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి

పియర్స్‌లో ఉండే ఫైబర్ వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి బాడీ వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది

డయాబెటిస్‌ను ఈ పండ్లు తగ్గిస్తున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది