బరువు తగ్గడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటి చిట్కాలను ప్రతి రోజూ పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా రోజు వారి డైట్‌లో పలు ఆహారాలు చేర్చుకుంటే సహజంగా సులభంగా బరువు తగ్గొచ్చు
ఎలాంటి ఆహారాలను తీసుకుంటే సులభంగా బరువు తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు 10 నుంచి 20 నిమిషాల పాటు వాకింగ్ చేయాల్సి ఉంటుంది..
మొలకెత్తిన పప్పులను తీసుకుని సలాడ్స్‌లా చేసుకుని డైట్‌లో తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువు తగ్గుతారు.
ఇడ్లీ సాంబార్ కూడా శరీర బరువును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది.
అన్ని రకాల పప్పులను తీసుకుని ఒక రోజు ముందే నీటిలో నానబెట్టుకుని అట్టు, దోసెలా వేసుకుని తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.
లీచీ పండ్లలో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఈ పండ్లతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా శరీర బరువు నియంత్రించవచ్చు.