రైనా, కపిల్ దేవ్ రికార్డులు బ్రేక్.. తుఫాన్ బ్యాటింగ్‌తో భారత యువ ప్లేయర్ రచ్చ..
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
అయితే ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.
చివర్లో సుందర్ వచ్చి బీభత్సం చేసి భారత్‌ను 300 దాటించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో సురేశ్ రైనా 13 ఏళ్ల రికార్డును సుందర్ బద్దలు కొట్టాడు.
రైనాతో పాటు, అతను వెటరన్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ కంటే కూడా ముందున్నాడు.
చివర్లో వచ్చిన సుందర్ 16 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ సమయంలో సుందర్ 231.25 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.
దీంతో న్యూజిలాండ్‌లో అత్యంత వేగంగా 30కి పైగా పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సుందర్ నిలిచాడు.
2009లో రైనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. రైనా 18 బంతుల్లో 211.11 స్ట్రైక్-రేట్‌తో 38 పరుగులు చేశాడు.
1992లో కపిల్ దేవ్ న్యూజిలాండ్‌లో 206.25 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.