అతిరథ, అతిరథ మహారథ పదాలను యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్ధ్యాన్ని తెలుపుతాయి
వీటిని ఐదు స్థాయిలుగా విభజించారు. అవి రథి, అతిరథి, మహారథి, అతిమహారథి, మహామహారథి
ఈ రోజు అతిరథ మహారథులు ఏకకాలంలో ఎంతమందితో యుద్ధం చేయగలరో తెలుసుకుందాం
ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలవారిని రథి అని అంటారు
రథికి 12రెట్లు అంటే ఏకకాలంలో 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలవారిని అతిరథి అని అంటారు
అతిరథికి 12రెట్లు.. అంటే 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడిని మహారథి అని అంటారు
మహారథికి 12రెట్లు అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడిని అతిమహారథుడు అని అంటారు
అతిమహారథికి 24రెట్లు అంటే ఏకకాలంలో 20,73,60,000 మందితో ఏకకాలంలో యుద్ధం చేయగల వీరుడిని మహామహారథి అని అంటారు