బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో అలియాభట్ కూడా ఒకరు . ఎప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది అలియా
అయినాసరే తన భావాలను ప్రతిబింబించేలా తొమ్మిది బుక్స్ రాస్తానంటుంది ఈ భామ
గతేడాది అలియా జీవితంలోకి తన కుమార్తె రాహా రాకతో కొన్నాళ్ళు ప్రసూతి విరామం తీసుకుంది
తన పాప రాహాకు కథలపై ఆసక్తి కలిగేలా ‘బ్రాడ్-ఎ-మమ్మా’ అనే కథల పుస్తకాలను ప్రారంభించింది
ఇటీవలే ఒక పత్రిక ఇంటర్వ్యూలో తన కూతురు గురించి మాట్లాడింది అలియా
‘పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం. రాహా పసిపాప అయినా నేను చదివేది శ్రద్ధగా వింటుంది. .త్వరలోనే కథల పుస్తకాలను ప్రారంభించాలనుకుంటున్నాను
కానీ, నాకు భాష సరిగా రాదు కాబట్టి నేను అవి రాస్తానో లేదో తెలియదు. .కానీ, నా సోదరి షాహిన్ భట్ ఇందులో కచ్చితంగా భాగం అవుతుంది
ఆనందం, దయ, ఆశ లాంటి భావోద్వేగాలతో తొమ్మిది పుస్తకాలను విడుదల చేయాలనే ఆలోచన ఉంది’ అని చెప్పింది