యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం దాస్ కా ధమ్కీ.

నివేదా పేతురాజ్‌, హైప‌ర్ ఆది, రంగ‌స్థ‌లం మ‌హేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదలైంది.

విశ్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌  రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

ఈ మేరకు విశ్వక్ సేన్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది

తాజాగా ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది.

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.