వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్న యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌  రీసెంట్ గానే ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహించడం విశేషం.

అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాను థియేట్రికల్ గా విడుదలైన 5 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలి కానీ అంతకంటే ముందే స్ట్రీమింగ్ చేసే ప్లాన్ చేస్తున్నారట.

థియేటర్లలో డిమాండ్ కాస్త తగ్గినట్లు హింట్ రావడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ముందుకు జరపాలని చూస్తున్నారట.

తాజా సమాచారం మేరకు ఏప్రిల్ రెండవ వారం లేదా మూడో వారంలో ఈ ధమ్కీని అమెజాన్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది.