20 నిమిషాల్లో కోహ్లీని ఫాంలోకి తీసుకొస్తా.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

కేవలం 20 నిమిషాల్లోనే విరాట్ కోహ్లీని మళ్లీ ఫామ్‌లోకి తీసుకొస్తానని మాజీ వెటరన్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ అన్నాడు.

నేను అతనితో కేవలం 20 నిమిషాలు మాట్లాడితే, అతన్ని తిరిగి ఫామ్‌లోకి తీసుకురాగలను.

ఆఫ్ స్టంప్ వెలుపల వెళ్తున్న బంతుల్లో కోహ్లీ అవుట్ అయ్యే సమస్యను తొలగిస్తాని తెలిపాడు.

కోహ్లీ ఇంగ్లండ్ పర్యటనలో కేవలం 76 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఇంగ్లండ్‌ పర్యటనలో విరాట్‌ ఒక టెస్టు, 2 టీ20, 2 వన్డేల్లో మొత్తం 6 ఇన్నింగ్స్‌ల్లో 76 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విరాట్ వరుసగా 11, 20, 1, 11, 16, 17 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. గత సీజన్‌లో కోహ్లీ 16 ఇన్నింగ్స్‌ల్లో 294 పరుగులు చేశాడు.