విరాట్ vs సచిన్ రికార్డులు ఇవే.. అగ్రస్థానం ఎవరిదంటే?
భారత్ vs శ్రీలంక వన్డేలు.. మంగళవారం గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో లంకతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ తన 45వ సెంచరీ సాధించాడు. కోహ్లీ కొన్ని వ్యక్తిగత మైలురాళ్లను దాటాడు. వాటిలో రెండు లెజెండ్ సచిన్‌కు చెందినవే.
కోహ్లీ vs సచిన్ వన్డే సెంచరీలు.. 266 వన్డేలో కోహ్లీ 45 సెంచరీలు సాధించగా, సచిన్ 463 వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు.
కోహ్లీ vs సచిన్ వన్డే సరుగులు.. 266 వన్డేల్లో కోహ్లీ 93.24 స్ట్రైక్ రేట్, 57.72 సగటుతో 12584 పరుగులు చేశాడు. సచిన్ 463 వన్డేల్లో 86.23 స్టైక్ రేట్, 44.83 సగటుతో 18426 పరుగులు చేశాడు.
వన్డేల్లో కోహ్లీ vs సచిన్ ఫోర్లు, సిక్స్‌లు.. కోహ్లీ 266 వన్డేల్లో 1184 బౌండరీలు, 128 సిక్స్‌లు బాదగా, సచిన్ 463 వన్డేల్లో 195 సిక్సర్లు, 2016 ఫోర్లు కొట్టాడు.
కోహ్లీ vs సచిన్ టీ20 సెంచరీలు, అర్థ సెంచరీలు.. టీ20ల్లో కోహ్లీ 115 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు చేయగా, సచిన్ 1 టీ20 మాత్రమే ఆడాడు.
కోహ్లీ vs సచిన్ టీ20 పరుగులు.. టీ20ల్లో కోహ్లీ 115 మ్యాచ్‌ల్లో 4008 పరుగులు చేయగా, సచిన్ 1 టీ20 మాత్రమే ఆడాడు. అందులో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.
కోహ్లీ vs సచిన్ టెస్ట్ సెంచరీలు.. విరాట్ కోహ్లీ 27, సచిన్ 51
కోహ్లీ vs సచిన్ టెస్ట్ పరుగులు.. విరాట్ కోహ్లీ 8119, సచిన్ 15921
వన్డేల్లో విరాట్ కోహ్లీ అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును బ్రేక్ చేయండి ఖాయమని భావిస్తున్నారు. ఇంకో 5 సెంచరీలు కావాల్సి ఉంది.